టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు | TRS MLC candidates finalized | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Published Mon, Mar 6 2017 3:52 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఎమ్మెల్యే కోటాలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గంగాధర్‌గౌడ్‌
గవర్నర్‌ కోటాలో ఫరూఖ్, డి.రాజేశ్వర్‌కు మరో అవకాశం
పేర్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌  


సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. శాసనమండలిలో ఎన్నికలు జరిగే స్థానా లకు పోటీ చేసే పార్టీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రకటించారు. త్వరలో ఖాళీ ఏర్పడే స్థానాలకూ అభ్య ర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థు లుగా వుల్లోల గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పేర్లను సీఎం ప్రక టించారు. ఎమ్మెల్యే కోటా కింద 3 స్థానాలకు, స్థానిక సంస్థల కోటా కింద ఒక స్థానానికి, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఒక స్థానానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

త్వరలోనే గవర్నర్‌ కోటా కింద 2 ఖాళీలు ఏర్పడుతు న్నాయి. ఈ  ఖాళీలకు డి.రాజేశ్వర్‌రావు, ఫరూఖ్‌ హుస్సేన్‌ల పేర్లను ప్రభుత్వం తరఫున ప్రతిపాదించాలని సీఎం నిర్ణయించారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఐఎంకు చెందిన సయ్యద్‌ అమీనుల్‌ అసద్‌ జాఫ్రీకి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా ఎన్నికకు కాటేపల్లి జనార్దన్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సోమవా రం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హోంమంత్రి నాయిని, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి మాదాటి రమేశ్‌రెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తలుగా సీఎం ప్రకటించారు.

సుభాష్‌రెడ్డి పేరు పరిశీలించినా: అభ్యర్థిత్వాలు ఖరారవడంతో ప్రస్తుత ఎన్నికల్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ముస్లిం సామాజిక వర్గానికి 2, రెడ్డి సామాజిక వర్గానికి 2, క్రిస్టియన్లకు ఒకటి, బీసీలకు ఒకటి, వెలమ సామాజిక వర్గా నికి ఒకటి చొప్పున దక్కినట్లయింది. కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి పేరును కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం కాలేదు. మళ్లీ ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడినప్పుడు సుభాష్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఫరూఖ్, రాజేశ్వర్‌లకు మళ్లీ అవకాశం
ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఫరూఖ్‌ హుస్సేన్, డి.రాజేశ్వర్‌లకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. మే 27న వీరిద్దరి పదవీ కాలం ముగియనుంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వీరిద్దరినీ మరోసారి గవర్నర్‌ కోటాలో ప్రతిపాదించనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో ఆ సీట్లు ఆశిస్తున్న పార్టీ నేతల ఆశలకు గండి కొట్టినట్లయింది.

విధేయతకే పట్టం.. చేరిక నేతలకు ప్రాధాన్యం...
అభ్యర్థుల ఎంపికలో విధేయతకు పెద్దపీట వేయటంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు సీఎం ప్రాధాన్యమిచ్చారు. వివిధ సందర్భాల్లో వారికిచ్చిన మాటను సీఎం నిలబెట్టు కున్నారు. సీనియర్‌ నాయకుడు, తొలి నుంచీ పార్టీలో ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఈసారి అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్‌ క్రమశిక్షణ మండలి చైర్మన్‌గా పని చేసిన కృష్ణా రెడ్డి దివంగత మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు. టీడీపీ నుంచి గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావును ఊహించినట్లుగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

పార్టీ అడ్‌హక్‌ కమిటీల నియామకంలో ఆయనకు సీఎం హైదరాబాద్‌ సిటీ కన్వీనర్‌గా కీలక బాధ్యతలు కట్టబెట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మైనంపల్లి మేయర్‌ స్థానాన్ని ఆశించారు. అది దక్కకపోవటంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇవ్వటంతో ఎమ్మెల్యేల కోటాలో మైనంపాటిని సర్దు బాటు చేశారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పని చేసిన గంగాధర్‌ గౌడ్‌కు మళ్లీ అవకాశం దక్కింది. ఎమ్మెల్సీగా చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఎన్నిక సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే గంగాధర్‌గౌడ్‌కు మళ్లీ చాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement