సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో.. టీఎస్ టెట్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో.. టీఎస్ టెట్ ఇంగ్లిష్ శిక్షణ
Published Mon, Jun 26 2017 12:58 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
సిలబస్‌లోని అన్ని అంశాలపై వారం పాటు బోధన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు సన్నద్ధమయ్యే లక్షలాది మంది అభ్యర్థులకు తోడ్పాటు అందించేందుకు ‘సాక్షి’ ముందుకు వచ్చింది. ‘టెట్’లో విజయానికి ఎంతో కీలకమైన ఇంగ్లిష్‌పై అభ్యర్థులు పట్టు సాధించేలా టీఎస్ టెట్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ వర్క్‌షాప్‌లో టెట్ ఇంగ్లిష్‌కు సంబంధించిన అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇంగ్లిష్ పేపర్–1, పేపర్–2లో వచ్చే సిలబస్‌పై రోజుకు రెండు గంటలపాటు పరీక్షల కోణంలో విస్తృత బోధన ఉంటుంది.
వర్క్‌షాప్‌లో బోధించే అంశాలు: పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, కంపోజిషన్, వొకాబులరీ, మీనింగ్ ఆఫ్ ఇడియమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సీక్వెన్సింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ది గివెన్ పేరాగ్రాఫ్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్ వితిన్ ఏ సెంటెన్స్, పెడగాగి తదితర అంశాలను బోధిస్తారు.
వర్క్‌షాప్: జూన్ 27 నుంచి జూలై 3 వరకు..
సమయం: మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు
ఫీజు: రూ.1,500
రిజిస్ట్రేషన్లు, తరగతులు: ‘సాక్షి’ ప్రధాన కార్యాలయం, కేర్ ఆస్పత్రి సమీపంలో,బంజారాహిల్స్ రోడ్ నం.1, హైదరాబాద్
వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300లో లేదా sakshiedge@gmail.comలో గానీ సంప్రదించవచ్చు
Advertisement