సాక్షి, హైదరాబాద్: నకిలీ పదోన్నతుల ఉత్తర్వులు తయారు చేసి మోసానికి పాల్పడిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు పల్లె రాజశేఖర్‌రెడ్డి, డి.మురళీకృష్ణలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. రూ.3 వేల చొప్పున జరిమానా చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. పంచాయతీ రాజ్ కార్యాలయంలోని బీ విభాగం సూపరింటెండెంట్ పల్లె రాజశేఖర్‌రెడ్డి, సీని యర్ అసిస్టెంట్ డి.మురళీకృష్ణ.. నకిలీ పదోన్నతి ఉత్తర్వులు తయారు చేస్తున్నా రని 1999లో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్.చెల్లప్ప ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.