వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | Two killed in separate accidents in hyderabad | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Published Sun, Aug 28 2016 12:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Two killed in separate accidents in hyderabad

హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్.7లో డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి హోండా యాక్టివాపై వెళుతుండగా వెగంగా వచ్చిన బెంజికారు ఢీకొంది. ఈ సంఘటనలో డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అలాగే మియాపూర్‌లో ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో లారీవద్ద ఉన్న డ్రైవర్ మృతిచెందాడు. అతివేగం వల్లే ఈ రెండు ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement