డీసీఎం ఢీకొట‍్టడంతో కారు దగ‍్ధం | dcm dash...car burn | Sakshi
Sakshi News home page

డీసీఎం ఢీకొట‍్టడంతో కారు దగ‍్ధం

Published Mon, Dec 18 2017 10:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

dcm dash...car burn - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- డీసీఎం ఢీకొట్టిన సంఘటనలో డీసీఎం డీజిల్‌ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు దగ‍్ధమైంది. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement