♦ 24 మంది విద్యార్థులు, ఒక దర్శకుడు కూడా
♦ జడ్జి ముందు హాజరు పరిచి చర్లపల్లి జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు బుధవారం నుంచి అరెస్టులు ప్రారంభించారు. వీసీ లాడ్జిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం కేసులో ఇద్దరు హెచ్‌సీయూ అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది విద్యార్థులతో పాటు వారికి మద్దతుగా వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన తులసీ అభిలాష్ అనే సినీ దర్శకుడిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు! వీరిపై ఐపీసీ 442, 324, 506, 353, 342 సెక్షన్లతో పాటు పీడీపీపీ చట్టంలోని సెక్షన్ 3 కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో 54 మందిని నిందితులుగా ప్రాథమికంగా గుర్తించారు.
ప్రొఫెసర్లను అరెస్టు చేయడం హెచ్‌సీయూ చరిత్రలో ఇదే తొలిసారి! వీరిని బుధవారం న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. వీరిలో దర్శకుడు తులసి, ప్రొఫెసర్ ఏసురత్నం మినహా మిగతా 25 మందిని పోలీసుల విధి నిర్వహణను అడ్డుకున్న కేసులో కూడా నిందితులుగా చూపారు. అరెస్టైన 24 మంది విద్యార్థుల్లో 11 మంది ఎమ్మే, ఐదుగురు పీహెచ్‌డీ, నలుగురు ఎం.ఫిల్, ఎమ్మెస్సీ, ఒకరు ఎంటెక్ , ఇద్దరు ఇతర పీజీ కోర్సులు చదువుతున్నారు. అరెస్టులు దుర్మార్గమని ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. బూధవారం ఉదయం మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో వారిని ఆయన, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీ జాన్ పరామర్శించారు.
అరెస్టయిన ప్రొఫెసర్లు
తథాగత్ సేన్ గుప్తా, గణిత విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ (పశ్చిమబెంగాల్) కొండా ఏసురత్నం, పొలిటికల్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ (ప్రకాశం)
అరెస్టయిన విద్యార్థులు: ముదావత్ వెంకటేశ్, (పీహెచ్‌డీ), నల్లగొండ, దొంత ప్రశాంత్, (పీహెచ్‌డీ), కరీంనగర్, బైకాని లింగస్వామి, (పీహెచ్‌డీ), నల్లగొండ, ఎన్.సుబ్బారావు, పీహెచ్‌డీ (పొలిటికల్ సైన్స్), పశ్చిమ గోదావరి, హృషికేష్ కుంభార్, (ఎంఫిల్), ఒడిశా, మహ్మద్ హసన్ జమాన్, (ఎంఫిల్), పశ్చిమబెంగాల్, అవతార్ సింగ్, (ఎంఫిల్), పంజాబ్, శ్రీరాగ్, (ఎంఫిల్), కేరళ, ప్రసమ విజయరావు చౌదరి (ఎంటెక్), మహారాష్ట్ర, దుంగ హరీశ్, (ఎమ్మెస్సీ), శ్రీకాకుళం, మన్నె క్రిశాంక్ (ఎంసీజే), కరీంనగర్, పేరం అమృతరావు, (ఎమ్మే), గుంటూరు, వి. మున్సిఫ్, (ఎమ్మే), కేరళ, ఇ.రమేష్, (ఎమ్మే), కేరళ, సుభదీప్ కుమార్, పీహెచ్‌డీ (కెమిస్ట్రీ), పశ్చిమబెంగాల్, వియ్యాల గౌతమ్, (పీజీ డిప్లొమా), రంగారెడ్డి, దీపక్ సుదేవాన్, (ఎమ్మే), కేరళ, తీప్తాంకర్ చక్రవర్తి, (ఎమ్మే), పశ్చిమబెంగాల్, మహ్మద్ షా, (ఎమ్మే), కేరళ, పి.ఆదిత్యన్, (ఎమ్మే), కేరళ, మాథ్యూ జోసెఫ్, (ఎమ్మే), కేరళ, రజత్ ఠాకూర్, (ఎమ్మే), మధ్యప్రదేశ్, మహ్మద్ అజ్మల్, (ఎమ్మే), కేరళ, ఆషిక్ మహ్మద్, (ఇంటిగ్రేటెడ్ ఎమ్మే), కేరళ.
హెచ్‌సీయూ కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు
Published Thu, Mar 24 2016 2:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement