ఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి? | Uttamkumar Reddy comments on Sand Mafia | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి?

Published Thu, Aug 3 2017 3:27 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

ఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి? - Sakshi

ఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి?

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
 
సాక్షి, హైదరాబాద్‌: ఇసుక మాఫియా ధన దాహానికి మరో దళిత కుటుంబం రోడ్డున పడిందని, ఒక దళితుడి ప్రాణం ఇసుక లారీ కింద నలిగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామంలో గిన్నె శంకర్‌ అనే దళిత రైతు పొలం వద్దకు వెళుతుండగా ఇసుక లారీ ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారని, ఆయనను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. ఈ మేరకు ఉత్తమ్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

బుధవారం మంత్రి కేటీఆర్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో సిరిసిల్లలో పర్యటించారని, ఇదే సమయంలో లారీ ప్రమాదంలో మరో దళితుడు బలి అయ్యారని అన్నారు. అయినా కూడా కేటీఆర్‌ నుంచి స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement