హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్‌ | V. Hanmanta Rao on TRS | Sakshi
Sakshi News home page

హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్‌

Published Thu, Jul 13 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్‌

హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: హరితహారం పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోందని, ఇది టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన కొత్త కార్యక్రమమని హంగామా చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు బుధవారం విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో సర్కార్‌ లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వానిది ఆర్భాటం: పొన్నం
హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో ప్రజానిర్బంధం కొనసాగిందని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆర్భాటం చేస్తోందన్నారు. ఉస్మానియా వర్సిటీలో ప్రభుత్వ నిర్బంధం సరికాదని, వర్సిటీ ఉత్సవాల్లో కేసీఆర్‌ను మాట్లాడనీయనందుకే ఈ తరహా నిర్బంధం అమలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement