మైనార్టీల అభివృధ్ధ్దికి కట్టుబడి ఉన్నా: కేసీఆర్ | we work for minorities development | Sakshi
Sakshi News home page

మైనార్టీల అభివృధ్ధ్దికి కట్టుబడి ఉన్నా: కేసీఆర్

Published Mon, May 26 2014 2:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మైనార్టీల అభివృధ్ధ్దికి కట్టుబడి ఉన్నా: కేసీఆర్ - Sakshi

మైనార్టీల అభివృధ్ధ్దికి కట్టుబడి ఉన్నా: కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యం లో రాష్ట్ర కమిటీ ప్రతినిధుల బృందం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించింది. ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించి అమలు చేయాలని, ఉర్దూ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ల, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లను కేటాయించాలని, సామూహిక వివాహ పథకం కింద ముస్లింలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.25వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement