సాక్షి, హైదరాబాద్: ముస్లింల పెళ్లంటే ఆడంబరం.. హంగు.. ఆర్భాటం.. పెద్ద ఎత్తున డీజే సౌండ్‌లతో పెళ్లి కొడుకు బరాత్, నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా నిఖా (పెళ్లి) తంతు, విందులో 10 నుంచి 20 రకాల ఆహార పదార్థాలు, తెల్లవారుజాము వరకు విందు భోజనం ఆరగింపు. ఇక ఇలాంటి పెళ్లి వేడుకలకు ఫుల్‌స్టాప్ పడనుంది. సాదాసీదాగా పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. ఆంక్షలతో కూడిన బరాత్.. రాత్రి తొమ్మిది గంటల్లోపు నిఖా (పెళ్లి) తంతు.. రాత్రి 11.30 గంటల్లోగా వివా హ విందు పూర్తి చేసి, అర్ధరాత్రి 12 గంటల్లోగా ఫంక్షన్ హాల్ మూతవేయాలి. ఈ మేరకు మంగళవారం వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో చైర్మన్ సలీం అధ్యక్షతన జరిగిన ‘ముస్లిం వివాహ వేడుకల నియంత్రణ సదస్సు’ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సులో ఇస్లామిక్ స్కాలర్స్, మతగురువులు, ముఫ్తీలు, ఉలేమాలు, మషాయిఖీన్లు, ఖాజీలు, పోలీసు ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
నిఖాపై సమయ పాలన
వివాహ వేడుకల్లో పెళ్లి (నిఖా) ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయాలని నిర్ణయించింది. రాత్రి తొమ్మిది తర్వాత నిఖా జరిపించవద్దని ఖాజీలకు సూచించింది. దీనిని ఉల్లంఘించే ఖాజీలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సదస్సు వక్ఫ్‌బోర్డుకు విజ్ఞప్తి చేసింది. మసీదుల్లో నిఖాను జరిపించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ఖాజీలకు గైడ్‌లైన్స్ జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సాదాసీదాగా విందు
పెళ్లి విందులో ఆడంబరాలకు వెళ్లకుండా సాదాసీదాగా ఒక బిర్యానీ, ఒక కర్రీ, ఒక స్వీట్ మాత్రమే పెట్టాలని సదస్సు సూచించింది. విందు భోజనాలు కూడా రాత్రి 11.30 గంటల్లోగా పూర్తి చేయాలని కోరింది. సెలబ్రిటీ, వీవీఐపీలకు వారి విజ్ఞప్తుల మేరకు షరియత్‌కు లోబడి విందును అనుమతిం చాలని సదస్సు నిర్ణయించింది.
బరాత్, ఫంక్షన్ హాళ్లపై ఆంక్షలు
పెళ్లి వేడుకల సందర్భంగా జరిగే బరాత్, ఫంక్షన్ హాల్ సమయాలపై ఆంక్షలు విధించాలని సదస్సు నిర్ణయించింది. హంగు, ఆర్భాటాల బరాత్‌ను కట్టడి చేయాలని, ఫంక్షన్ హాళ్లను రాత్రి 12 గంటల్లోపు మూసేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని సదస్సు సూచించింది. వివాహ వేడుకల్లో డ్యాన్స్‌లను బహిష్కరించాలని సదస్సు నిర్ణయించింది.
రాత్రి 9 లోపు నిఖా పూర్తికావాలి
Published Wed, Jan 24 2018 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment