హైదరాబాద్‌కు అద్భుత భవిత | Wonderful future to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు అద్భుత భవిత

Published Sat, Jun 24 2017 12:42 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

హైదరాబాద్‌కు అద్భుత భవిత - Sakshi

హైదరాబాద్‌కు అద్భుత భవిత

డాలస్‌ సెంటర్‌ భూమి పూజ కార్యక్రమంలో కేటీఆర్‌
- అభివృద్ధిలో కనీవినీ ఎరగని రీతిలో దూసుకుపోతోంది..
అన్ని నగరాలకు ఒకేతీరున నిధులివ్వొద్దని కేంద్రానికి వినతి
మెట్రో, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు స్థాయిని బట్టి నిధులివ్వాలి..
స్మార్ట్‌ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు
 
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ భవిష్యత్‌ అద్భుతంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం హోటల్‌ తాజ్‌కృష్ణాలో డాలస్‌ సెంటర్‌కు కేటీఆర్‌ భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ, ఇతర నగరాలతో పోలిస్తే బెస్ట్‌ లివింగ్‌ సిటీగా హైదరాబాద్‌ ముం దుందని, గతంలో ఎన్నడూ లేనంతగా హైదరా బాద్‌ అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌పై ఎంతో నమ్మకం ఏర్పడిందని, టీఎస్‌ ఐపాస్‌తో కంపెనీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ–హబ్‌ మారిందని, 2,000 స్టార్టప్స్‌కు వేదికైందని పేర్కొన్నారు.

ఇక నగరంలో రోడ్ల అభివృద్ధిపై సామాజిక మాధ్యమాల ద్వారా సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరానికి ల్యాండ్‌మార్క్‌గా చెప్పుకునే భవనాలు అవ సరమని ప్రభుత్వ సలహాదారు పాపారావు అన్నారు. ఇలాంటి అధునాతన భవనాలు పెట్టుబడులను సైతం ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. రాజధానిలో నిర్మించే డాలస్‌ సెంటర్‌.. ఇంక్యుబేషన్‌ స్థాయి ని దాటి అంత ర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ఐటీ కంపె నీలకు వేదికగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం లో ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రం జన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
నగరాల స్థాయిని బట్టి నిధులివ్వాలి
కేంద్రం చిన్న పట్టణాలు, పెద్ద నగరాలను ఒకేతీరుగా చూడటం సరికాదని కేటీఆర్‌ అన్నారు. అన్ని నగరాలకు సమంగా నిధులు కేటాయించటం సరికాదని, మెట్రో సిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు, పంచాయతీలకు వాటి స్థాయిని బట్టి నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరినట్లు తెలిపారు. స్మార్ట్‌ సిటీల జాబితాలో కరీంనగర్‌కు చోటు కల్పిం చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలి పారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీం నగర్‌కు స్థానం దక్కడం సంతోషంగా ఉంద న్నారు. జీఎస్టీ వల్ల తాగు, సాగునీటి ప్రాజెక్టు లపై ఒక్క తెలంగాణలోనే రూ.10 వేల కోట్ల భారం పడేలా ఉందని, జీఎస్టీతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు.

గ్రానైట్‌ పరిశ్రమ, టెక్స్‌ టైల్స్, హ్యాండ్లూమ్‌ రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయిం చాలని కేంద్రాన్ని కోరు తున్నామని తెలిపారు. సీఎం ఢిల్లీలో ఉన్నా రని, దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి విన్నవించే అవకాశముందని వివరిం చారు. శనివారం ఉదయం పోచంపల్లిలో పొదుపు పథకాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో వరంగల్‌ స్మార్ట్‌ సిటీ జాబితాలో ఉండగా.. తాజాగా కరీంనగర్‌కు చోటు కల్పించారు.
 
ఆగస్టులో మారథాన్‌..
హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే మారథాన్‌ పరుగు టీషర్ట్, లోగోను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఆగస్టు 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో మారథాన్‌ పరుగు ఉంటుందని తెలిపారు. పరుగులో వివిధ నగరాల నుంచి 20 వేల మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ సారి తాను కూడా మారథాన్‌ పరుగులో భాగస్వామిని అవుతానని కేటీఆర్‌ ప్రకటించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement