తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో సుల్తానా బేగం(22) అనే యువతి ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో సుల్తానా బేగం(22) అనే యువతి ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఫలక్‌నూమా పరిధిలోని జహనూమాలో బుధవారం రాత్రి జరిగింది.గురువారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కొనిచ్చిన మొబైల్ ఫోన్‌ను సుల్తానా బేగం ఎక్కడో పారేసుకుంది. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఆవేశానికి లోనై ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.