
నేదురుమల్లికి వైఎస్ జగన్ నివాళులు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. సోమాజిగూడలోని నేదురుమల్లి స్వగృహానికి వెళ్లిన ఆయన నేదురుమల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేదురుమల్లి మృతి పట్ల జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేదురుమల్లి శుక్రవారం ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
కాగా వైఎస్ జగన్తో పాటు పార్టీ నేత సోమయాజులు కూడా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, సి.రామచంద్రయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు నేదురుమల్లికి నివాళులు అర్పించారు.