అగ్రిగోల్డ్పై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్ | ys jagan mohan reddy takes on chandra babu government | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్పై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్

Published Mon, Mar 28 2016 6:13 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

అగ్రిగోల్డ్పై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్ - Sakshi

అగ్రిగోల్డ్పై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్

హైదరాబాద్: పశ్చిమబెంగాల్లో 2460 కోట్ల రూపాయల శారద చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతోందని, అంతకంటే ఎక్కువ మోసం చేసిన అగ్రిగోల్డ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ అయితే డొంక కదులుతుందని సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శించారు. అగ్రిగోల్డ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో కొన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో చూపించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అగ్రిగోల్డ్పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 40 లక్షల మందికిపైగా బాధితులు ఉన్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించిందని వెల్లడించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన టీడీపీ ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దోషులను శిక్షించాల్సింది పోయి, వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. 2014లో నెల్లూరులో అగ్రిగోల్డ్పై తొలికేసు నమోదైందని, 2015 జనవరి 5న సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. విచారణ దారుణంగా జరుగుతోందని విమర్శించారు. సీఐడీ విచారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార పార్టీ నాయకులు పలుమార్లు అడ్డుతగులుతూ ఎదురుదాడికి దిగారు. సభలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..  

  • అగ్రిగోల్డ్పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
  • అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు
  • అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ 2015 ఫిబ్రవరి 20న జీవో 23 ఇచ్చారు.. ఇందులో తిరుపతికి సంబంధించిన ఆస్తిని ఎక్కడా ప్రస్తావించలేదు
  • అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ అనే వ్యక్తి ఆ ఆస్తిని అమ్మేశాడు
  • అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థ రాం ఆవాస్ రిసార్ట్స్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్.. మంత్రి పుల్లారావు భార్యకు ఈ భూములు అమ్మారు
  • జీవో 23 రావడానికి నెల ముందే పుల్లారావు తన భార్య పేరిట భూములు కొన్నారు. ఆధారాలను సభలో వైఎస్ జగన్ చూపించారు.
  • వెంకాయమ్మ పేరుతో భూములు కొనుగోళ్లు జరిగాయి. మంత్రి ఈ విషయాన్ని ఒప్పుకొన్నందుకు సంతోషం
  • ప్రభుత్వం అటాచ్ చేసిన భూముల్లో ఈ భూమిని చేర్చలేదు
  • సీఐడీ అధికారులు సీతారామ్ అవ్వాస్, ఉదయ్ కిరణ్లను అరెస్ట్ చేయలేదు
  • వీరిద్దరినీ కాకుండా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు
  • హైకోర్టు జడ్జి నేతృత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగాలి
  • 1998లో సెబి అగ్రిగోల్డ్ కంపెనీని నిషేధించమని చెప్పింది
  • అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేదు?
  • సెబీ అగ్రిగోల్డ్ను బ్యాన్ చేయమంటే.. చంద్రబాబు అదే కంపెనీ చైర్మన్లో ఫొటో దిగారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement