హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్)పై తీవ్ర దుమారం రేగింది. ఎస్డీఎఫ్ పేరుతో టీడీపీ నుంచి ఓడిపోయిన నేతలకు, ఆ పార్టీ ఇన్చార్జ్లకు నిధులు కేటాయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా టీడీపీ నేతలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కందుల నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుతో ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు కెటాయించిన విషయాన్ని వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు.
ఎస్డీఎఫ్ విషయంలో ప్రభుత్వ విధానంపై ప్రతిపక్ష వైఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.