పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్చందర్ | ysrcp leader vijay chander two acres land gift to PV Sindhu | Sakshi
Sakshi News home page

పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్చందర్

Published Sat, Aug 20 2016 3:41 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్చందర్ - Sakshi

పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్చందర్

హైదరాబాద్: ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. పీవీ సింధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement