హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం ప్రజలను, ప్రపంచాన్ని, సభను కూడా తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో రాజధానిలో మొత్తం 850 కోట్లు దేనికి ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. '2200 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చామని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. అమిత్ షా వచ్చినపుడు 500 కోట్ల రూపాయలను అసెంబ్లీ, రాజ్‌భవన్, సెక్రటేరియట్‌కు కేటాయించామని చెప్పారు. తాత్కాలిక రాజధానికే 200 కోట్లు పెడుతున్నారు. శాశ్వత రాజధానికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారు. ఈ ప్రాంతంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కౌలు ఇవ్వలేదు. కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వడంలేదు. దుబారా చేయడం వాస్తవమేనా, న్యాయమేనా?
సింగపూర్ వాళ్లు ఉచితంగా ఇస్తారని చెప్పడం, తర్వాత వాళ్లకు డబ్బులివ్వడం ఎంతవరకు సమంజసం?
మంత్రి ఇప్పటికైనా కరెక్టుగా ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చుపెట్టారో లెక్క చెప్పాలని కోరుతున్నా' అని అన్నారు.
మంత్రి నారాయణ సమాధానమిస్తూ.. కేంద్రం నుంచి 850 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యాన్యుటీ కోసం 163 కోట్లు, పెన్షన్లకు 60.5 కోట్లు, రుణమాఫీకి 75.6 కోట్లు, స్కిల్ డెవలప్ మెంట్ కు 3.5 కోట్లు ఖర్చుపెట్టామని నారాయణ చెప్పారు.
రూ. 850 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు?
Published Wed, Mar 16 2016 10:07 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
Advertisement
Advertisement