
ఇడ్లిబ్ : సిరియాలోని తిరుగుబాటుదారుల ప్రాంతాలపై రష్యా బలగాలు జరిపిన వైమానికదాడుల్లో 10మంది సిరియా పౌరులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని కఫ్రాన్‌బెల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరియా ప్రభుత్వం, రష్యాలు కలిసికట్టుగా ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే.