అర్జెంటీనా : తల్లి స్కూటర్‌ను దొంగలించాలని చూసిన ఓ వ్యక్తికి చుక్కలు చూపిందో చిన్నపిల్ల. అతడిపై పంచులు కురిపించి, ప్రాణాలకు భయపడి పరుగులుపెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని జరేట్‌లో బుధవారం రాత్రి ఓ మహిళ తన ఇంటి సమీపంలో స్కూటర్‌పై కూర్చుని ఉంది. ఇంతలో అటువైపుగా వెళుతున్న ఓ దొంగ ఆమె వద్దకు వచ్చి, స్కూటర్‌ను లాక్కోటానికి చూశాడు. అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలో హెల్మెంట్ ధరించి నిలబడి ఉన్న 11ఏళ్ల ఆమె కూతురు అతడిపై విరుచుకుపడింది. ముఖంపై చేతితో పంచులుకురిపించింది. మరుక్షణంలో ఆమె తల్లి కూడా అతడిపై దాడిచేయటం ప్రారంభించింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి దొంగ బిక్కచచ్చిపోయాడు. చేసేదేమీ లేక బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి పరుగులు తీశాడు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment