
ఒట్టావా: కెనడా దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు రైల్వే సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణీకులు మరణించారు. అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో ఈ ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కెనడా దేశంలోని మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రైరీ ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో ఇప్పటి దాకా 13మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైలు ప్రమాదం ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తునకు ఆదేశించింది.