బైక్లపై బాంబులతో సైన్యంపైకి దూసుకొస్తూ.. | 16 Boko Haram fighters, 2 soldiers killed in Nigeria shootout | Sakshi
Sakshi News home page

బైక్లపై బాంబులతో సైన్యంపైకి దూసుకొస్తూ..

Published Sun, Jul 10 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

బైక్లపై బాంబులతో సైన్యంపైకి దూసుకొస్తూ..

బైక్లపై బాంబులతో సైన్యంపైకి దూసుకొస్తూ..

నైజీరియా: నైజీరియాలో బొకోహారమ్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ ఆర్మీ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు రాగా ఆర్మీ బలగాలు వారిని సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో 16మందిని హతం చేశాయి. అయితే, ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయాన్ని నైజీరియా ఆర్మీ విభాగం స్పష్టం చేసింది. బైక్ లపై బాంబులు వేసుకొని వస్తూ నేరుగా ఈశాన్య నైజీరియాలోని ఓ సైనిక క్యాంపులోకి దూసుకొచ్చేందుకు వారు ప్రయత్నించగా సైన్యం వారిని అడ్డుకొంది. ఈ క్రమంలో వారి మధ్య గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఓ సూసైడ్ బాంబు ట్రక్కును కూడా అధికారులు పేల్చివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement