
కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని జావా రాష్ట్రంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. 90 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 105 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అనేక మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వందలాది మంది పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద పడి మరణించినవారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 420 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. భారీ వర్షానికి మట్టిపెళ్లలు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. శిథిలాలను తొలగించేందుకు భారీవాహనాలు వెళ్లడం కూడా కష్టమవుతోంది.
**