తల్లి జులియా(ఎడమ), కురెక్(కుడి)
స్టాఫోర్డ్ షైర్: గర్భనిరోధక మాత్రల ఓ టీచర్ జీవితంలో విషాదాన్ని నింపాయి. దాదాపు నెల పాటు గర్భ నిరోధక మాత్రలు వాడిన టీచర్.. తన ప్రాణాలు కోల్పోయారు. స్టాఫోర్డ్ షైర్ లోని టామ్ వర్త్ కు చెందిన ఫాలెన్ కురెక్ టీచింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తోంది. అయితే రుతుస్రావం సక్రమంగా రావడానికి కొన్ని మాత్రలను పదే పదే తీసుకుంది. ఆ మందులను 25 రోజుల పాటు వాడిన తరువాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఒక్కసారిగా వాంతులు ప్రారంభం కావడంతో పాటు శ్వాస పూర్తిగా నిలిచిపోయింది. ఆపై ఆమె శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ కురెక్ తల్లి దండ్రులు బ్రయాన్, జులియాల హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే మూడు రోజుల పాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడిన కురెక్ ఆ తర్వాత కన్నుమూసింది.