భారీ వర్షాలతో 25 మంది మృతి
Published Tue, Jun 13 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
ఢాకా: బంగ్లాదేశ్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 25 మంది వరకు మృత్యువాత పడ్డారు. రాజధాని ఢాకాతో పాటు చిట్టగాంగ్ నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరదల కారణంగా రంగమతిలో 10 మంది, బందర్‌బన్, చిట్టగాంగ్‌లలో ఏడుగురు చొప్పున చనిపోయారని వార్తా సంస్థలు ప్రకటించాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావటం గమనార్హం.
Advertisement
Advertisement