చైనాను మాగీ తుపాను వణికిస్తోంది.
బీజింగ్: చైనాను మాగీ తుపాను వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆగ్నేయ చైనా జీజియాంగ్ ప్రావిన్స్ గ్రామాల్లో కొండ చెరియలు విరిగిపడి 32 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. సుకున్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 26 మంది తప్పిపోయారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. చైనా ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. పాఠశాలలకు సెలవు ప్రకటింది.