ఆఫ్ఘన్‌లో భారీగా ఉగ్రవాదులు హతం | 44 militants killed within day in Afghan raids | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్‌లో భారీగా ఉగ్రవాదులు హతం

Published Sun, Jan 31 2016 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

ఆఫ్ఘన్‌లో భారీగా ఉగ్రవాదులు హతం

ఆఫ్ఘన్‌లో భారీగా ఉగ్రవాదులు హతం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. భద్రతా దళాలు చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోందని, ఈ ఆపరేషన్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లోనే 44 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో 27మంది ఉగ్రవాదుల గాయపడగా, ఒకడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది.

ఆఫ్ఘన్‌లోని వర్దాక్, కాందహార్, హెల్మండ్, బాఘ్లాన్ ప్రావిన్సుల్లో భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయని రక్షణశాఖను ఉటంకిస్తూ చైనా వార్తాసంస్థ సిన్హుహ తన కథనంలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారని తెలిపింది. ఉగ్రవాదంతో కల్లోలంగా మారిన ప్రావిన్సుల్లో తిరిగి శాంతిని పునరుద్ధరించేందుకు ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ చేపట్టగా, దీనిని ప్రతిఘటిస్తూ తాలిబన్ ఉగ్రవాదులు బాంబు దాడులు, సాయుధ ఎదురుదాడులు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement