
వెల్లింగ్‌టన్: అరవై ఐదేళ్ల వయసున్న వ్యక్తి ఆడవాళ్ల లోదుస్తులు దొంగతనం చేసి పోలీసులకి చిక్కిన వింత ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర ఒటాగోకు చెందిన స్టీఫెన్ గ్రాహం గార్డ్‌నర్(65) స్పా సేవల కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న డునెదిన్‌లోని మోనా పూల్‌కి వెళ్లాడు. పూల్‌లో ఉండగా, పక్కనే ఉన్న ఫ్లాట్‌లో యువతులు అద్దెకి దిగిన విషయం తెలుసుకుని, వారు లేనప్పుడు కిటికీ గుండా ఆ ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు.
కాసేపటికి యువతులు తిరిగొచ్చిన చప్పుడు వినపడడంతో బయటికొచ్చి వారిని తోసుకుంటూ చోరీ చేసిన 8 జతల లోదుస్తులతో చీకట్లోకి పారిపోయాడు. పరిగెత్తుతున్నప్పుడు కొన్నిదుస్తులు జారిపడిపోయాయి. ఆ తర్వాత దగ్గర్లోని బార్‌కు వెళ్లి మద్యం సేవించి పడిపోయిన దుస్తులను తీసుకోవడానికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఇంకా శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కాగా, ఇతను 2013లో ఇలాంటి దొంగతనమే చేసి వెయ్యి డాలర్ల జరిమానాతో పాటు పదకొండు నెలల గృహ నిర్భందాన్ని ఎదుర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment