హీనమైన పని చేసినందుకు 235 ఏళ్ల జైలు శిక్ష | a man sentenced to 235 years in prison for child porn | Sakshi
Sakshi News home page

హీనమైన పని చేసినందుకు 235 ఏళ్ల జైలు శిక్ష

Published Wed, Sep 14 2016 8:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

హీనమైన పని చేసినందుకు 235 ఏళ్ల జైలు శిక్ష

హీనమైన పని చేసినందుకు 235 ఏళ్ల జైలు శిక్ష

న్యూయార్క్: చైల్డ్ పోర్న్కు పాల్పడుతున్న ఓ వ్యక్తికి అమెరికాలో ఓ కోర్టు దాదాపు మరణ శిక్ష వేసినంత పనిచేసింది. 235 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరు పిల్లలతో బలవంతంగా లైంగిక వీడియోలను రూపొందిస్తూ పట్టుబడిన అతడిని కోర్టు కఠినంగా శిక్షించింది. ఇదే కేసులో అతడికి సహాయపడిన మరో మహిళకు కూడా కోర్టు 235ఏళ్ల జైలు శిక్ష విధించింది. లివర్పూల్ లో జాసన్ కాప్(46) అనే వ్యక్తి ఉన్నాడు. అతడు గత కొంత కాలంగా చిన్న పిల్లలను ఎగుమతి చేయడమే కాకుండా వారితో బలవంతంగా పోర్న్ వీడియోలు స్వయంగా తీయడం, వారి ఫొటోలు తీసి విక్రయించడం వంటి హీనమైన చర్యలు చేస్తున్నాడు.

ఈ చర్యల్లో అతడికి అలెన్ బాండ్ అనే మహిళ కూడా సహాయ పడింది. తమ ప్రాంతంలో చైల్డ్ పోర్న్, పిల్లలపై వేధింపుల చర్యలను నిలువరించే క్రమంలో భాగంగా చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ టాస్క్ ఫోర్స్ బృందం జాసన్ కాప్తో తొలుత మెస్సేజ్ల ద్వారా సంబంధం పెట్టుకుంది. అలా అతడి ద్వారానే విషయాలు రాబట్టింది. చివరకు తాము అండర్ కవర్ పోలీసు అధికారులమని చెప్పడంతో తన దగ్గర ప్రస్తుతం ఓ చిన్నారి ఉన్నమాట వాస్తవమేనని, ఆ పాపను ఎమిలీ ఒబరస్ట్ అనే మహిళ తన వద్దకు తీసుకొచ్చిందని చెప్పాడు. ఆ పాప ప్రతి రోజు పాఠశాలకు తీసుకెళ్లేందుకు ఎమిలీ బాధిత బాలిక తల్లిదండ్రులు పెట్టుకున్నారట. ఆమెను ఈ నవంబర్ లో విచారించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement