ప్రతీకాత్మక చిత్రం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు నంగరార్‌లో 27 మంది ఉగ్రవాదులను అఫ్గాన్ ప్రత్యేక భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా తాలిబన్లు ఉత్తర అఫ్గాన్‌లో భద్రత బలగాలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 15 మంది పోలీసులు మృతిచెందారు.
ఐఎస్ ఉగ్రవాదులకు కంచుకోటగా ఉన్న అఫ్గాన్‌లోని అచిన్ జిల్లా నంగరార్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ల ద్వారా దాడులు చేశాయి. ఈ దాడుల్లో 27 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు నంగరార్ ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడు అజ్మల్ ఒమర్ మీడియాకు తెలిపారు. అయితే ఈఘటనను ఉగ్రవాద సంస్థకు చెందిన మీడియా అమఖ్ వార్తా సంస్థ మాత్రం అఫ్గాన్–అమెరికా సంయక్త దళాల చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొంది. అయితే అజ్మల్ ఒమర్ మాత్రం ఈ ఆపరేషన్‌లో అమెరికా దళాలు పాల్గొన్నాయా లేదా అన్నది తెలియదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment