
ఆరోగ్యం కోసం కొందరు జాగింగ్ చేస్తే.. ఇంకొందరు పరుగెత్తుతారు.. మరికొందరు సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. మరి వీటన్నింటిలో ఏది బెటర్? బాడీబిల్డింగ్ లాంటి ప్రత్యేకమైన లక్ష్యాలేవీ లేకపోతే నిండైన ఆరోగ్యానికి నడకకు మించిన తారకమంత్రం లేదు అంటోంది అమెరికాలో తాజాగా ముగిసిన ఓ అధ్యయనం. డాక్టర్లు సూచించినంత కాకపోయినా అందులో కొంతైనా నడిచినా.. ఏ వ్యాయామమూ చేయనివారి కంటే ఎక్కువ కాలం జీవించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఒక అంచనా ప్రకారం వారానికి 150 నిమిషాలు అంటే రోజుకు 20–25 నిమిషాల పాటు నడిచినా లేదా రోజుకు 10–12 నిమిషాలు వేగంగా నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అమెరికాలో కేన్సర్ ప్రివెన్షన్ స్టడీస్–2 న్యూట్రిషన్ కోహర్ట్ అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 1.4 లక్షల మంది వివరాలను అల్పా పటేల్ అనే శాస్త్రవేత్త విశ్లేషించారు. ఏ రకమైన వ్యాయామం చేయని వారు ఇందులో దాదాపు ఐదు శాతం ఉంటే మిగిలిన వారు కొద్దోగొప్పో వ్యాయామం చేసేవారున్నారు. ధూమపానం, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలను పక్కనబెట్టి పరిశీలించినప్పుడు వారానికి రెండు గంటల కంటే తక్కువ నడక సాగించే వారు కూడా ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment