నోబెల్ బహుమతి (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్‌హోమ్ : నోబెల్ అవార్డుల విషయంలో సంచలనం. సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ఇవ్వబోమని నోబెల్ అవార్డుల ఫౌండేషన్ ప్రకటించింది. సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని స్వీడన్‌కు చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ అవార్డుల ఫౌండేషన్ తెలిపింది.
స్వీడిష్ అకాడమీలో నోబెల్ ప్రైజ్ బోర్డులో అధ్యక్షులు, నలుగురు సభ్యులు ఉంటారు. అందులో ఓ మహిళా సభ్యురాలి భర్త మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయి. 1996 నుంచి 2017 ఆయన కిరాతకాలు జరిగాయని, అకాడమీ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకునే వాడని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. పురస్కారాన్ని ఇచ్చే స్థాయి ఈ అకాడమీకి లేదని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, 2018 సాహిత్య నోబెల్ పురస్కారాన్ని వచ్చే ఏడాది పురస్కారంతో కలిపి ఇస్తామని నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. 1901 నుంచి నోబెల్‌పురస్కారాలు ఇస్తుండగా..1935లో సాహిత్య రంగంలో విజేతలు ఎవరూ ఎంపిక కావటంతో పురస్కారాన్ని ఇవ్వలేదు. నోబెల్‌కు ‘సెక్స్’ మరకలు
Comments
Please login to add a commentAdd a comment