ఐఫోన్ 5ఎస్ మరింత ఇంప్రూవ్ అవుతోంది!
న్యూయార్క్: యాపిల్ ఐఫోన్-5 ఎస్ మరిన్ని మెరుగులు దిద్దుకుంటోంది. ఐఫోన్-6లో ఉన్న స్పెషల్ ఫీచర్లను 5ఎస్‌లోనూ అమర్చాలని యాపిల్ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 5ఎస్ తరహాలో నాలుగు అంగుళాల పొడవు ఉన్న కొత్త ఐఫోన్‌ను వచ్చే మార్చి నెలలో మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమరా, 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆపిల్ ప్లే యాప్ పనిచేసేవిధంగా ఎన్‌ఎఫ్‌సీ చిప్, ఏ 8 ప్రాసెసర్‌తోపాటు కనెక్టివీటికి సంబంధించి వై-ఫై వంటి ఫీచర్లు మరింత మెరుగవ్వనున్నాయని 'వర్జ్' మీడియా సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ ఫోన్‌లో స్వల్పంగా డిజైన్ మార్పులు కూడా ఉంటాయని యాపిల్ తెలిపిందని అది పేర్కొంది. దీనిని ఐఫోన్-5ఎస్‌ఈగా పిలిచే అవకాశముంది. లైవ్ ఫోటో ఫీచర్‌ను సపోర్ట్ చేసే ఈ మోడల్ మార్చి నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. దీనితోపాటు కొత్త వెర్షన్ యాపిల్ వాచ్‌లను కూడా విడుదల కానున్నాయి.