సరిహద్దులో సొరంగం | Army finds 'secret tunnel' along LoC in J&K | Sakshi
Sakshi News home page

సరిహద్దులో సొరంగం

Published Sun, Aug 24 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

Army finds 'secret tunnel' along LoC in J&K

అక్నూర్: భారత్-పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత భూభాగం వైపుగా తవ్విన ఓ సొరంగాన్ని సైన్యం శుక్రవారం కనుగొంది. జమ్మూలోని పల్లన్‌వాలా సెక్టార్‌లో చక్లా పోస్టు వద్ద తవ్విన ఈ సొరంగం రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు, 50 మీటర్ల పొడవు ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రోజువారీ విధుల్లో భాగంగా గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల కోసమే ఈ సొరంగం తవ్వి ఉంటారని, అయితే భారత్ వైపు సొరంగం పూర్తి కాలేదు కాబట్టి.. ఇంతవరకూ దీనిద్వారా ఎలాంటి చొరబాట్లు జరగలేదన్నారు. కాగా, జూలై 22న ఉగ్రవాదుల చొరబాటును సైన్యం అడ్డుకున్న సందర్భంగా ఓ ఉగ్రవాదితో పాటు జవానూ చనిపోయారు. ప్రస్తుత సొరంగం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. 2008లో కూడా ఇదే ప్రాంతంలో ఓ సొరంగాన్ని సైన్యం కనుగొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement