ఏం చేయాలో మాకు చెప్పనవసరం లేదు! | Artificial evolution lead to the creation of self-organised robots | Sakshi
Sakshi News home page

ఏం చేయాలో మాకు చెప్పనవసరం లేదు!

Published Sat, Aug 8 2015 7:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

ఏం చేయాలో మాకు చెప్పనవసరం లేదు!

ఏం చేయాలో మాకు చెప్పనవసరం లేదు!

లండన్: సాధారణంగా రోబోలు మనం అప్పగించిన పనిని సమర్థంగా చేయగలవు. అయితే అవసరాలకు అనుగుణంగా పనిని విభజించుకునే రోబో బృందాన్ని బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీవెన్‌కు చెందిన ఎలిసియో ఫైటీ బృందం తయారు చేసింది. ‘సాధారణంగా చీమలు, తేనెటీగలు, చెదపురుగుల పనిని విభజించుకుంటాయి. ఈ విధానం మాకు ప్రేరణ కలిగించింది. దీని ఆధారంగా మా ప్రాజెక్టు మొదలుపెట్టాం’ అని ఎలిసియో తెలిపారు.

ఇందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. రోబో బృందానికి ఒక పని అప్పగించామనీ, అందులో ఎవరు ఏ పని చేయాలో విభజించుకుని పూర్తి చేశాయని వెల్లడించారు. ఎక్కడా పొరపాటు జరగలేదని తెలిపారు. ఈ విధానాన్ని యూనివర్సిటీ ఆఫ్ లీవెన్,  ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బ్రసెల్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు.
 

Advertisement
Advertisement