ఏం చేయాలో మాకు చెప్పనవసరం లేదు!
లండన్: సాధారణంగా రోబోలు మనం అప్పగించిన పనిని సమర్థంగా చేయగలవు. అయితే అవసరాలకు అనుగుణంగా పనిని విభజించుకునే రోబో బృందాన్ని బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీవెన్కు చెందిన ఎలిసియో ఫైటీ బృందం తయారు చేసింది. ‘సాధారణంగా చీమలు, తేనెటీగలు, చెదపురుగుల పనిని విభజించుకుంటాయి. ఈ విధానం మాకు ప్రేరణ కలిగించింది. దీని ఆధారంగా మా ప్రాజెక్టు మొదలుపెట్టాం’ అని ఎలిసియో తెలిపారు.
ఇందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. రోబో బృందానికి ఒక పని అప్పగించామనీ, అందులో ఎవరు ఏ పని చేయాలో విభజించుకుని పూర్తి చేశాయని వెల్లడించారు. ఎక్కడా పొరపాటు జరగలేదని తెలిపారు. ఈ విధానాన్ని యూనివర్సిటీ ఆఫ్ లీవెన్, ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బ్రసెల్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు.