తొక్కిసలాటలో 10మంది భక్తుల మృతి | at least 10 people have been killed and dozens more injured in a stampede during a Hindu religious gathering in Bangladesh says police | Sakshi
Sakshi News home page

తొక్కిసలాటలో 10మంది భక్తుల మృతి

Published Fri, Mar 27 2015 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

at least 10 people have been killed and dozens more injured in a stampede during a Hindu religious gathering in Bangladesh says police

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని  శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో సుమారు పదిమంది హిందూ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. లంగల్ బంద్ దేవాలయానికి వేలాదిమంది భక్తులు  పోటెత్తడంతో పరిస్థితి అదుపు తప్పి ఈ తొక్కిసలాటకు దారి తీసింది. మరో  30మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారంతో యాభైఏళ్లు పైబడినవారని తెలుస్తోంది.

మృతుల్లో ఏడుగురు మహిళలున్నారని  స్థానిక పోలీసు ఉన్నతాధికారి మజురూల్  ఇస్లాం తెలిపారు. రాజధాని ఢాకా సమీపంలో పాత బ్రహ్మపుత్ర  నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా  పుణ్యస్నానాలు చేస్తారు. చైత్ర అష్టమి సందర్భంగా ఇక్కడ పుణ్యస్నానం చేస్తే  తమ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement