- పుతిన్ బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే
మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఓ ఆస్ట్రేలియా న్యాయసేవల సంస్థ కోర్టుకు ఈడ్చింది. ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు రష్యా, పుతిన్ పరిహారం చెల్లించాలంటూ మానవహక్కుల యూరోపియన్ కోర్టులో దావా వేసింది.
2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు. ఇందులో 28మంది ఆస్ట్రేలియన్లు. ఈ విమానాన్ని కూల్చేసిన భూ-గగనతల క్షిపణి రష్యాలో తయారయినదని డచ్ సెఫ్టీ బోర్డు తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాకు చెందిన బాధిత కుటుంబాల తరఫున సిడ్నీకి చెందిన ఎల్‌హెచ్‌డీ లాయర్స్ సంస్థ యూరోపియన్ కోర్టులో దావా వేసింది. చనిపోయిన ప్రతి బాధితుడి కుటుంబానికి రూ. 67.42 కోట్ల పరిహారం చొప్పున రష్యా చెల్లించాలని డిమాండ్ చేసింది.