కాస్మిక్‌ కిరణాల కోసం పే..ద్ద బెలూన్‌! | Balloon goes up to where the cosmic rays are | Sakshi
Sakshi News home page

కాస్మిక్‌ కిరణాల కోసం పే..ద్ద బెలూన్‌!

Published Wed, Apr 26 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

కాస్మిక్‌ కిరణాల కోసం పే..ద్ద బెలూన్‌!

కాస్మిక్‌ కిరణాల కోసం పే..ద్ద బెలూన్‌!

వాషింగ్టన్‌: పాలపుంత ఆవల నుంచి భూ వాతావరణంలోకి చొచ్చుకుని వచ్చే కాస్మిక్‌ కిరణాలను గుర్తించేందుకు నాసా ఒక మిషన్‌ను ప్రారంభించింది. దీనికోసం ఫుట్‌బాల్‌ స్టేడియమంత పరిమాణంలో ఉండే అతిపెద్ద సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ను ప్రయోగించింది. భూమి నుంచి 33.5 కి.మీ. ఎత్తులో ఈ బెలూన్‌ ఎగురుతూ వంద రోజులకు పైగా తన పనిని నిర్వహించనుంది.

2015, 2016లో బెలూన్‌ డిజైన్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఈ ఏడాది మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా బెలూన్‌ ప్రోగ్రామ్‌ ఆఫీస్‌ చీఫ్‌ దెబీ ఫెయిర్‌బ్రదర్‌ చెప్పారు. భూ వాతావరణంలోని నైట్రోజన్‌ అణువులతో కాస్మిక్‌ కిరణాలు కలసి అతినీలలోహిత ఫ్లోరెసెన్స్‌ కాంతిని ఉద్గారం చేస్తాయన్నారు. ఈ కాస్మిక్‌ కిరణాలు సరిగ్గా ఎక్కడ నుంచి వెలువడుతున్నాయో గుర్తించేందుకు ఈ మిషన్‌ ఉపయోగపడుతుందని షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒలింటో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement