నైజీరియాలో మరో 40 మంది కిడ్నాప్
కానో: నైజీరియాలోని బోర్నో రాష్ట్రం మలారీ గ్రామానికి చెందిన 10-23 ఏళ్ల మధ్య వయసున్న 40 మంది బాలలు, యువకులను బోకోహరామ్ మిలిటెంట్లుగా భావిస్తున్న దుండగులు కిడ్నాప్ చేశారు. ఒకటో తేదీన పెద్ద సంఖ్యలో మిలిటెంట్లు గ్రామంలోకి వచ్చి వీరిని బలవంతంగా దగ్గర్లోని సబీసా అడవుల్లోకి తీసుకెళ్లారని గ్రామం నుంచి పారిపోయి వచ్చిన స్థానికులు చెప్పారు. బోకో హరామ్ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 200 మంది విద్యార్థినులు బందీలుగా ఉండడం తెలిసిందే.
ఇదిలా ఉండగా స్థానికంగా ఉన్న నిషేధిత ఫులానీ హెర్డ్స్ మెన్ మిలిటెంట్లు15 మందిని దారుణంగా కాల్చిచంపారు. శుక్రవారం ఈ ముష్కరులు భారీ ఆయుధాలతో నైజీరియాలోని అంబే మదాకీ గ్రామంలో పలు ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు.