లండన్: బాగా విసుగు, చిరాకుతో ఉన్నారా.. అయితే మీరు పొలిటిషియన్ అయినట్లే. అవును ఇది నిజమే.. లండన్లోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు. విసుగు, చిరాకు అనేది ఒక వ్యక్తి ఆలోచనను చివరి అంచుకు తీసుకెళ్తుందని, ఆ సమయంలో అతడు తీసుకునే నిర్ణయాలు అత్యంత వ్యూహాత్మకంగా, రాజకీయంగా దూసుకెళ్లేందుకు పనికొస్తాయని అంటున్నారు.
లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ లైమెరిక్కు చెందిన కింగ్స్ కాలేజీకి చెందిన అధ్యయనకారులు ఈ అంశంపై ప్రత్యేక పరిశోధన నిర్వహించారు. ‘విసుగు ప్రజలను చివరి అంచుకు తీసుకెళుతుంది. అది వారిని సవాళ్లను స్వీకరించడానికి, త్వరపడటానికి ఉపయోగపడుతుంది. రాజకీయ వ్యూహాలన్ని కూడా ఆహ్వానించదగినట్లుగా ఉంటాయి’ అని ఈ వర్సిటీకి చెందిన డాక్టర్ విజ్నాడ్ వ్యాన్ టిల్బర్గ్ చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయగల స్థితి బోర్ గా ఫీలయ్యేవారిలో ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
బోర్గా ఉందా.. అయితే మీరే జననేత
Published Fri, Jul 8 2016 12:20 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement
Advertisement