చెన్నై అమ్మాయికి అరుదైన గౌరవం | Chennai-born Shefali now Seattle deputy mayor | Sakshi
Sakshi News home page

చెన్నై అమ్మాయికి అరుదైన గౌరవం

Nov 20 2017 11:03 AM | Updated on Nov 20 2017 11:03 AM

Chennai-born Shefali now Seattle deputy mayor - Sakshi

చెన్నై : అమెరికన్‌ రవాణా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న భారతీయ అమెరికన్‌ షెఫాలీ రంగనాథన్‌(38)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్‌కు ఆమె డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2014-15 నుంచి సియాటెల్‌ రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ట్రాన్స్‌పోర్టేషన్‌ చాయిసెస్‌ కొలేషన్‌లో ఆమె ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

షెఫాలీలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్‌ మేయర్‌ జెన్నీ డెర్కన్‌ తన టీమ్‌లో చేర్చుకుని నగరానికి డిప్యూటీ మేయర్‌గా నియమించారు. చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, చదువులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుండేదని ఆమె తండ్రి ప్రదీప్ రంగనాథన్‌ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 

షెఫాలీ పాఠశాల విద్యాభ్యాసం అంతా చెన్నైలోని నూగంబాక్కంలో సాగింది. స్టెల్లా మేరీస్‌ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం అన్నావర్సిటీ నుంచి పర్యావరణ శాస్త్రంలో గోల్డ్‌ మెడల్ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement