కదిలే బ్రిడ్జిలాంటి బస్సు! | china invented transit elevated bus | Sakshi
Sakshi News home page

కదిలే బ్రిడ్జిలాంటి బస్సు!

Published Sat, Aug 6 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

కదిలే బ్రిడ్జిలాంటి బస్సు!

కదిలే బ్రిడ్జిలాంటి బస్సు!

ప్రజా రవాణా సౌకర్యాలున్నా, సదుపాయం కోసం సొంత వాహనాలలో రోడ్డు మీదికి వచ్చేవారు ఎక్కువౌతుండటంతో చైనా సహా చాలా దేశాలు ఇప్పుడు రహదారులపై వాహనాల రద్దీతో సతమతమౌతున్నాయి!

చైనా : ప్రజా రవాణా సౌకర్యాలున్నా, సదుపాయం కోసం సొంత వాహనాలలో రోడ్డు మీదికి వచ్చేవారు ఎక్కువౌతుండటంతో చైనా సహా చాలా దేశాలు ఇప్పుడు రహదారులపై వాహనాల రద్దీతో సతమతమౌతున్నాయి! ఈ రద్దీకి విరుగుడుగా చైనా ‘ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్’ (టి.ఇ.బి.)ని కనిపెట్టింది.

గత మేలో ఈ బస్సును డిజైన్ చేశారు. ఇప్పుడది ట్రయల్ రన్‌కు వచ్చింది. రోడ్ల మీద వెళుతున్న వాహనాల మీదుగా ప్రయాణించడం ఈ బస్సు ప్రత్యేకత. 72 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండే ఈ బస్సు విద్యుచ్ఛక్తితో నడుస్తుంది. ఒకేసారి 1400 మంది కూర్చోవచ్చు. అంటే 40 సాధారణ బస్సుల్లో పట్టేంత మంది! ఇది గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఈ బస్సులకు ‘లాండ్ ఎయిర్ బస్’ అని నామకరణం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement