బీజింగ్: చైనా అన్నంత పనిచేస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చెల్లబోదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిజంగానే భేఖాతరు చేస్తోంది. త్వరలోనే ఆ సముద్రంపై చైనా అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందట. ఈ విషయాన్ని అక్కడి మీడియా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన రెండు రోజులకే చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరోసారి కయ్యానికి కాలు దువ్వడమేనని తెలుస్తోంది.
దక్షిణ చైనా సముద్రంపై తమకంటే తమకే పెత్తనం ఉందని అటు చైనా, ఫిలిప్పీన్స్ ది హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లగా ట్రిబ్యునల్ మాత్రం పిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చైనాకు ఎలాంటి పెత్తనం లేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. అయితే, తాము ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోబోమని, తాము చేసేది చేస్తామని చైనా ప్రకటించింది. అన్నట్లుగానే ఓ మీడియా ద్వారా తాము అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామని, వాటి వల్ల దక్షిణ చైనా సముద్రంపై ప్రభావవంతమైన పట్టుసాధిస్తామని చెబుతోంది. ఒక వేళ ఇదే జరిగితే అంతర్జాతీయ సమాజంతో చైనా మరోసారి విమర్శలపాలు కాక తప్పదు.
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా
Published Fri, Jul 15 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
Advertisement
Advertisement