బీజింగ్: నేపాల్ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి జీ318ని, టిబెట్‌లోని షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన 40 కిలో మీటర్ల పొడవైన రోడ్డును చైనా సోమవారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని పౌర అవసరాలతోపాటు మిలిటరీ సేవలకు కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ రహదారి ద్వారా దక్షిణాసియా ప్రాంతాల్లోకి చేరుకోవడానికి చైనాకు సులభమవుతుంది. టిబెట్ రాజధాని లాస, షిగాసే నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు సమాంతరంగా కొత్త రోడ్డు మార్గం ఉంది. కాగా, జీ318 రహదారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరి నుంచే వెళ్తుంది.