
చైనాను అతలాకుతులం చేస్తున్న కోవిడ్-19 వల్ల కాలుష్యం తగ్గింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో చైనాలో తాత్కాలికంగా పరిశ్రమలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వూహాన్ నగరంలో కాలుష్య కారక నైట్రోజన్ డయాక్సైడ్ మునుపెన్నడూ లేని రీతిలో తగ్గినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చైనాలో నైట్రోజన్ డయాక్సైడ్ కారకాలు 10 నుంచి 30శాతం తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తం అవుతోంది.
చదవండి: కరోనా వైరస్ ఎలా సోకుతుందంటే..