బీజింగ్: డోక్లామ్ ప్రతిష్టంభనకు దౌత్య మార్గంలో పరిష్కారం కనుగొంటామని భారత్ ప్రతిపాదిస్తుంటే, చైనా ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆ వివాదాస్పద ప్రాంతం నుంచి భారత బలగాలను తరిమికొట్టేందుకు సైనిక చర్యకు దిగాలని చైనా యోచిస్తున్నట్లు ఆ దేశ అధికార మీడియాలో శనివారం కథనం ప్రచురితమైంది.
‘డోక్లామ్‌లో మిలిటరీ ప్రతిష్టంభనను చైనా ఎక్కువ కాలం కొనసాగనివ్వదు. భారత దళాలను వెళ్లగొట్టేందుకు రెండు వారాల్లో చిన్నపాటి సైనిక చర్యకు దిగొచ్చు’ అని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పరిశోధకుడు హు జియోంగ్‌ను ఉటంకిస్తూ ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.