నెట్ వాడొద్దని.. చెయ్యి కోసుకున్నాడు! | chinese teenager cuts off hand to leave internet addiction | Sakshi
Sakshi News home page

నెట్ వాడొద్దని.. చెయ్యి కోసుకున్నాడు!

Published Fri, Feb 6 2015 3:05 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

నెట్ వాడొద్దని.. చెయ్యి కోసుకున్నాడు! - Sakshi

నెట్ వాడొద్దని.. చెయ్యి కోసుకున్నాడు!

ఇంటర్నెట్కు బానిసలుగా మారితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది తరచు నిపుణులు చెప్పేమాట. సరిగా ఇలాంటి సంఘటన చైనాలోని జియాంగ్జు ప్రాంతంలో జరిగింది. వాంగ్ అనే 19 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్కు బానిసగా మారిపోయాడు. పరిస్థితిని తానే అర్థం చేసుకుని.. ఈ అలవాటు ఎలాగైనా వదిలించుకోవాలని భావించాడు.

కూరగాయలు తరిగే కత్తిని వెంట తీసుకుని వాంగ్ ఇంటినుంచి పారిపోయాడు. ఓ పార్కు బెంచిపై కూర్చుని కత్తితో తన ఎడమ చేతిని కోసేసుకున్నాడు. వెంటనే కాల్ టాక్సీని పిలిచి తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. వైద్యులు నానాతంటాలు పడి తెగిపోయిన చేతిని అతడికి మళ్లీ అమర్చారు.

చైనాలో నెట్ వాడకం అంటువ్యాధిలా వ్యాపించింది.  2.4 కోట్ల మంది దీనికి బానిసలయ్యారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడటం, బ్రౌజింగ్ లాంటి విషయాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయట పడేసేందుకు దేశంలో చాలా ప్రాంతాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement