లిఫ్ట్లో చితక్కొట్టింది | Chinese woman beats up man, who tries to grope her in lift | Sakshi
Sakshi News home page

లిఫ్ట్లో చితక్కొట్టింది

Published Sat, Apr 30 2016 3:46 PM | Last Updated on Mon, Aug 13 2018 3:46 PM

లిఫ్ట్లో చితక్కొట్టింది - Sakshi

లిఫ్ట్లో చితక్కొట్టింది

రాత్రి 9.30 సమయంలో లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న యువతి. దీన్ని అదునుగా భావించి అసభ్యకరంగా ప్రవర్తించాడో యువకుడు. ముందు ఎంతగానో ఓపిక పట్టి తర్వాత ఆమె కోపానికి కుప్పకూలిపోయాడు ఆ ఆకతాయి. వివరాలు.. లిఫ్ట్‑ లో చైనాకు చెందిన యువతి ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఓ యువకుడు లిఫ్ట్ లో ప్రవేశించాడు. యువతి ఫోన్తో బిజీగా ఉన్నసమయంలో మొదట ఆమెకు దగ్గరగా వచ్చాడు.

గమనించిన ఆమె ఏమీ అనకుండానే పక్కకు తప్పుకుంది. ఆ యువకుడు మరోసారి వెనక వైపుగా వచ్చి ఈ సారి ఏకంగా చేయిని యువతి భుజం పై వేశాడు. ఈ హఠాత్పరిణామంతో చిర్రెత్తుకొచ్చిన యువతి ఒక్క సెకన్ కూడా వేస్ట్ చేయకుండా ఆ కామాంధుడి చేయి తీసేసి, మోహంపై నుంచి ఒక్క గుద్దు గుద్దింది. అంతేనా చెప్పరాని చోట కాలుతో గట్టిగా ఓ తన్ను తన్ని అతను కిందికి వంగగానే మోహం పైనుంచి గట్టిగా కాలితో ఓ కిక్ ఇచ్చింది. అంతే ఆ యువకుడు లిఫ్ట్‑ లో కుప్పకూలిపోయాడు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు .. సదరు యువతి దైర్యసాహసాలను కొనియాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement