సియోల్/టెహ్రాన్/బీజింగ్: దక్షిణ కొరియాలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జాయి ఇన్ మంగళవారం చెప్పారు. వైరస్‌పై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ కారణంగా మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాలు రద్దయ్యాయి. అమెరికా, కొరియాలు సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన మిలటరీ కార్యక్రమాలను కూడా పరిమితం చేసుకుంది. మంగళవారం కరోనా సోకిన వారి సంఖ్య 60కి పరిమితమైందన్నారు. కరోనా కారణంగా ఇరాన్‌లో ముగ్గురు, జపాన్ తీరంలోని షిప్‌లో మరొకరు మృతిచెందారు.
చైనాలో తగ్గుముఖం
చైనాలో కరోనా తగ్గుముఖం పడుతోందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా వ్యాధి సోకుతున్న వారి సంఖ్య తగ్గుతోందన్నారు. సోమవారం నాటికి ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,663కు చేరుకోగా, 508 మంది మాత్రమే కొత్తగా ఈ వ్యాధి బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment