మా వ్యాక్సిన్‌ 99% పని చేస్తుంది | COVID-99: 99 Percent chance that coronavirus vaccine will work | Sakshi
Sakshi News home page

మా వ్యాక్సిన్‌ 99% పని చేస్తుంది: చైనా

Published Sun, May 31 2020 4:04 AM | Last Updated on Sun, May 31 2020 3:15 PM

COVID-99: 99 Percent chance that coronavirus vaccine will work - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్‌ సంస్థ సినోవాక్‌ స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌కు కరోనావాక్‌గా పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ మందును కోతులపై ప్రయోగించగా, కరోనా కణాలను ఇది సమర్థవంతగా అడ్డుకుందని వెల్లడించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు దశల పరీక్షలు పూర్తి అయినట్లు తెలిపింది. ఈ పరీక్షల కోసం 1000 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపింది. (ప్రైవేటు అయితే ఖరీదెక్కువ..)

చైనాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నందును మూడో దశ పరీక్షలు యూకేలో చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో పాటు పలు యూరప్‌ దేశాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఒకేసారి 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అధిక ముప్పు ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ మొదటగా అందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండోదశ నడుస్తోందని, మూడోదశ పరీక్షలకు సమయం పడుతుందని, వ్యాక్సిన్‌ వెంటనే వచ్చే అవకాశం లేదని పేర్కొంది. (అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్ : ఫైజర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement